ముత్యాల పోసి కుమార్ కు చిరు సత్కారం

Mar 30,2024 16:23 #East Godavari

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ఈరోజు ఉదయం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో వైయస్సార్సీపి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజాని ముత్యాల పోసి కుమార్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల. పోసి కుమార్ కు చిరు సత్కారం జక్కంపూడి. రాజా చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడిరాజా మాట్లాడుతూ స్ఫూర్తిచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల. పోసి కుమార్ వృద్ధులకు, దివ్యాంగులకు నిరంతరం సేవ చేస్తూ నిత్య అన్నదానంతో ఎంతోమందికి ఆకలి తీరుస్తూ అందరికీ ఆదర్శంగా ఉండే వ్యక్తిని అలాంటి పోసి కుమార్ కు గౌరవ డాక్టరేట్ లభించడం సంతోషంగా ఉందని పోసి కుమార్ కు తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ముద్దాల అను. రూరల్ వైఎస్ఆర్సిపి నాయకులు సూర్యచంద్రరావు. వైయస్సార్సీపి దివ్యాంగుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదం.ఫకీర్ పాల్గొన్నారు.

➡️