సమ్మెకు టిడిపి, జనసేన నాయకుల సంఘీభావం

Jan 11,2024 16:09 #East Godavari
anganwadi workers strike 31day in eg

ప్రజాశక్తి- చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహసీల్దార్ కార్యాలయం వద్ద  అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధికసమ్మె గురువారం నాటికి  31వ రోజుకి చేరుకుంది . అంగనవాడి కార్యకర్తల  సమ్మెకు మద్దతుగా టిడిపి పార్టీ జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చాగల్లు మండలం టిడిపి పార్టీనాయకులు ఆళ్ళ  హరిబాబు కేతాసాహెబ్ మోకాలపై కూర్చుని  మాట్లాడుతూ ప్రభుత్వం అంగనవాడి కార్యకర్తలు 31 రోజులు సమ్మె చేస్తున్న  ప్రభుత్వ వారి సమస్యలు పరిష్కారం చూపకుండా  వాళ్లపై నిర్బంధం కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని త్వరలో మూడు నెలలు  తమ ఉమ్మడి ప్రభుత్వం వస్తాదని మీ సమస్య పరిష్కరిస్తామని మద్దతు తెలిపారు. బుధవారం టెంట్లో ఒక మహిళ స్పృహ  తప్పి  పడిపోవడం గురువారం మరో మహిళా టెంట్లో పడిపోవడం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు వారు తెలిపారు.కొందరు అంగన్వాడి  కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద సమ్మెలో పాల్గొన్నారు. సగం మంది ఇక్కడ సమ్మెలో కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. పి విజయ కుమారి కె లక్ష్మి మాట్లాడుతూ  గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ, ఐసీడీఎస్ ప్రీస్కూల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కొవ్వూరు నియోజకవర్గ  నాయకులు టీవీ రామారావు, భవ్య, రామాంజనేయులు టిడిపి పార్టీ నాయకులు కేతాసాహెబ్, జొన్నకూటి వెంకయ్యమ్మ, దొంగ రామకృష్ణ, ఈడుపుగంటి  మురళి, తాలూరి ప్రసాదు, అంగన్వాడి కార్యకర్తలు,   పి విజయ్ కుమారి, కే లక్ష్మి, కే దమయంతి, ఏ శ్రీదేవి పాల్గొన్నారు.

➡️