ఇంటర్ ఫలితాల్లో చాగల్లు ప్రతిభ  

Apr 12,2024 15:58 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు  :  చాగల్లు మండలంలో శుక్రవారం  వెలువడిన ఇంటర్ ఫలితాలలో చాగల్లు శ్రీ వెలగపూడి రామకృష్ణ  ప్రభుత్వ ఇంంటర్ కళాశాల  నుండి హాజరైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 50 మంది హాజరు కాగా 38 మంది ఉత్తీర్ణత పొంది 76 శాతం సాధించారు. ప్రదమ సంవత్సరం విద్యార్థులు 74 మంది హాజరై 30 మంది ఉత్తీర్ణత పొంది 40.5 శాతం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పావని తెలిపారు. బైపీ సీలో ఎండి ఆశియా కళాశాల టాపర్ గా ఎంపిసీలో వీరవల్లి దుర్గ టాపర్ గా నిలిచారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోోనూతనంగా ఏర్పడిన చాగల్లు మహిళా జూనియర్ కాలీజీలో ఇంటర్ ద్వితీయ బైపీసీలో లక్మీ లావణ్య ప్రధమ ఇంటర్ లో సిఈసీలో కేతా సుభాశిణి ప్రధమ స్తానంలో నిలిసినట్లు కళాశాల ఇన్ ఛార్జి రాళ్లపల్లి వర ప్రసాద్ తెలిపారు.

➡️