కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

Apr 30,2024 23:23

రావూరుపాడులో ఎన్నికల ప్రచారం చేస్తున్న అరుణకుమారి

ప్రజాశక్తి-యంత్రాంగం

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తాళ్లపూడి ఎపికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అరిగెల అరుణకుమారి అన్నారు. ప్రచారంలో భాగంగా ఈమె మంగళవారం రావూరుపాడు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఈమె వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కడియం ఇంటింటికీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్‌ మంగళవారం జేగురుపాడులో ప్రచారం ర్వహించారు.ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, గిట్టుబాటు ధర కల్పించి మద్దత్తు గా నిలుస్తున్నామన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ మరియు ఎంఎల్‌ఎ రెండూ ఓట్లను హాస్తం గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉలిసెట్టి సత్తిబాబు, మండా రాజు, వెంకటరమణ, శ్రీనివాసు, బండారు వెంకన్న, ఫణితేజ, సత్యనారాయణ రాజు మరియ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️