దత్తుడి మృతి సీపీఐకు తీరని లోటు 

Mar 25,2024 15:51 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి : మండలం(తూర్పుగోదావరి జిల్లా) తీపర్రు, గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు భోగవల్లి నరశింహమూర్తి(దత్తుడు)కమ్యూనిస్టు ఆశయసాధనే లక్ష్యంగా అణగారిన వర్గాలు, రైతులు, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి ఎనలేని కృషి నిర్వహించారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కోనాల భీమారావు అన్నారు. సీపీఐ నాయకులు భోగవల్లి నరశింహమూర్తి (దత్తుడు) సంస్మరణ సందర్భంగా సోమవారం తీపర్రు గ్రామంలో వారి నివాసమందు భోగవల్లి నరశింహమూర్తి చిత్ర పటానికి భీమారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ కౌలు రైతుల సమస్యలు పరిష్కారానికి, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నరశింహమూర్తి ఎనలేని కృషి నిర్వహించారన్నారు. సీపీఐ తణుకు ఏరియా కార్యాలయం వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నిర్మాణానికి విరాళాలు సేకరణలో తన వంతు సహాయ సహకారాలు అందించారన్నారు .పెనుగొండ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి వంక సత్యనారాయణ గెలుపుకు ఎనలేని కృషి చేశారన్నారు.జీవితాంతం కమ్యూనిస్టు ఆశయసాధనే లక్ష్యంగా జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన నరశింహమూర్తి మృతి సీపీఐ పార్టీకు కు తీర్చలేని లోటుని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు భోగవల్లి వెంకటేశ్వరరావు, చంటిబాబు, సీపీఐ నాయకులు నామాన వెంకటేశ్వరరావు, పంతం నాగేశ్వరరావు, రెడ్డి రామకృష్ణ, రంగినీడి ఆదినారాయణ, సైపురెడ్డి బాబ్జీ, గుత్తుల మహాలక్ష్మి, ఏఐటీయూసీ నాయకుడు కంఠమని వెంకటేశ్వరరావు, మద్దిపాటి జానకిరామయ్య, కరుటూరి రామకృష్ణ, వెలగల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️