శాఖా గ్రంధాలలో వ్యాస విజ్ఞాన శిబిరం

May 18,2024 12:48 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు శాఖా గ్రంధాలయంలో శనివారం వేసవి విజ్ఞాన శిబిరాల్లో విద్యార్థులకు నీతి కథలు చెప్పడం, విద్యార్థులతో చదరంగం ఆడించడం, పుస్తక సమీక్ష, పుస్తక పఠనం చేయించడం కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రంథాల అధికారి జి శ్రీనివాస్ తెలిపారు. ఈ  కార్యక్రమంలో 9 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేసవిజ్ఞాన శిబిరములు జూన్ 7వ తేదీ వరకు నిర్వహించబడునని తల్లితండ్రులు తమ పిల్లలను ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయవలసిందిగా గ్రంథాలయాధికారి  గద్దె శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

➡️