ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

Apr 16,2024 22:27
ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

ప్రజాశక్తి-నల్లజర్లవేసవిలో ప్రభుత్వా సుపత్రికి వచ్చే ప్రజల దాహం తీర్చేందుకు ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినంద నీయమని నల్లజర్ల అంబేద్కర్‌ యూత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొందల శ్రీనివాసరావు అన్నారు. నల్లజర్ల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో అంబేద్కర్‌ యూత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నల్లజర్ల మండలంలోని ఎన్నో గ్రామాల నుంచి వైద్యం కోసం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వచ్చే ఎంతోమంది రోగులకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. వైద్య సేవలందించే విషయంలో ఎప్పుడూ ముందువరుసలో నిలిచే నల్లజర్ల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది కోరిక మేరకు అంబేద్కర్‌ యూత్‌ ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్‌ తెల్లం గంగాధరరావు, డాక్టర్‌ మహ్మద్‌ సిరాజుద్దీన్‌ మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ పలివెల ప్రసాదరావు, అంబేద్కర్‌ యూత్‌ నాయకులు ప్రత్తి వినోద్‌ కుమార్‌, గుదే శ్రీనివాసరావు, కూరపాటి నాగరాజు, వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు జి.వి.వి.ప్రసాద్‌, ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️