పోలింగ్ బూత్ లను పరిశీలించిన తాసిల్దార్ హేమ

Feb 9,2024 13:25 #East Godavari
mro visit polling booth

ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పోలింగ్ బూతులను శుక్రవారం నూతనంగా బదిలీపై వచ్చిన తహశీల్దార్ బి హేమ కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ హేమ కుమారి మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికలలో భాగంగా శుక్రవారం  వీరవంకపల్లి, పెంటపల్లి, రంప ఎర్రంపాలెం, గంగంపాలెం, తిరుమలయ్యపాలెం, మల్లవరం గ్రామాలకు సంబంధించిన పోలింగ్ బూతులను పరిశీలించడం జరిగింది అని తెలిపారు. తాసిల్దార్ వెంట రెవెన్యూ సిబ్బంది శ్రీరాములు, వీఆర్వో చంద్రకాంత, వీఆర్ఏ ప్రసన్న కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️