గణతంత్ర వేడుకలకు ఉండ్రాజవరం విద్యార్థినీలు

Jan 25,2024 15:18 #East Godavari
undrajavaram students select to republic day

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: గణతంత్ర వేడుకల సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించే పరేడ్ కు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఎంపికైనట్లు ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి విశ్వప్రసాద్ గురువారం తెలిపారు. సైనిక వీరుల ధైర్య సాహసాలు, జీవిత కధలను వ్రాయడం ద్వారా విద్యార్ధుల దేశభక్తి పెంచేందుకు కేంద్ర రక్షణ శాఖ, విద్యా శాఖలు సంయుక్తంగా నిర్వహించిన వీర గాధ 3.0 లో పాఠశాలలో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థిని కే పావని రాష్ట్రస్థాయి పద్య విభాగానికి, జిల్లా స్థాయి పద్య విభాగంలో కె నవ్యశ్రీ లు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థినులకు రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయిలో గణతంత్ర వేడుకలలో పాల్గొనేందుకు ఆహ్వానం అందిందన్నారు. వీరిని తీర్చిదిద్దిన పాఠశాల వాణిజ్య శాస్త్ర ఉపాధ్యాయులు జి.మహేష్ కుమార్ ను గ్రామ పెద్దలు, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, అధికారులు అభినందించారు.

➡️