ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం

Apr 13,2024 11:50

ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : పెద్దతిప్పసముద్రం మండలం, బూచుపల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ … బూచిపల్లి గ్రామం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శనివారం ఉదయం పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకుడైన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడానికి ఆనవాయితీగా బూచిపల్లి గ్రామం వస్తున్నదని అందుకని తాను కూడా ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టాలని ఇక్కడికి రావడం జరిగిందన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసిపి రెండవసారి గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకొని వైసిపి జెండా ఎగరవేయడమే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేసుకునేందుకు గెలుపు లక్ష్యం అంటూ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీ, జడ్పిటిసి, మండల కన్వీనర్లు వైస్‌ ఎంపీపీలు, ప్రత్యేక ఆహ్వానితులు, మండల అధ్యక్షులు సచివాలయ కన్వీనర్లు, మండల కార్యదర్శులు గృహసారధులు, బూతు మేనేజర్లు, బూతు ఏజెంట్లు, నాయకులు, జగనన్న అభిమానులు, పెద్దిరెడ్డి కుటుంబం అభిమానులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.

➡️