అంగన్వాడీల విజయోత్సవ సభ

చింతలపూడి : ఉద్యమం ద్వారానే అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు నేరవేర్చుకున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ఎస్‌.సత్యనారాయణ అన్నారు. చింతలపూడి పట్టణంలో పైర్‌ స్టేషన్‌ వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. 42 రోజుల అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు సహకరించిన వివిధ వర్గాల వారికి సమ్మె శిబిరంలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ .సరోజిని, టి.మాణిక్యం, జి.సరళ, ఎం.పద్మ, బి.ఫణి వరిథిని పాల్గొన్నారు.

➡️