అగ్ని బాధితురాలికి టిడిపి సాయం

ప్రజాశక్తి – ముదినేపల్లి

మండలంలోని పెయ్యేరు శివారు అప్పారావుపేట గ్రామానికి చెందిన పరసా సరోజినీ ఇల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఆదివారం రాత్రి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటిలోని గృహోపకారణమున్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. సరోజిని కట్టు వస్త్రాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న టిడిపి యువ నాయకులు కొడాలి వినోద్‌ సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి అప్పారావుపేట వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేలు ఆర్థికసాయం అందజేసి భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కలిల్పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రెసిడెంట్‌ జొన్నలగడ్డ వీరాస్వామి, ముదినేపల్లి ఉపసర్పంచి ఈడే సుధాకర్‌, అనగాని వెంకట్రావు, అనగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఇల్లు దగ్థమైన సరోజినిని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మనోజ్‌, వైష్ణవి పరామర్శించారు. సోమవారం అప్పారావుపేట వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, ప్రమాదంకు గల కారణాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.5 వేలు నగదు, నెలకి సరిపడా నిత్యవసర సరుకులు మనోజ్‌, వైష్ణవి సీతారామమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెయ్యేరు గ్రామ విఆర్‌ఒ కారే కేశవ, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️