అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి – ముసునూరు
జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాట్లు చేయడంతో తాగునీటి సమస్యకు పరిష్కరమవుతుందని ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. మండలంలోని ముసునూరులో రైతు భరోసా కేంద్రం, జలజీవన్‌ మిషన్‌ ద్వారా వాటర్‌పంపింగ్‌ సదుపాయం, కోర్లగుంటలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయడానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు డాక్టర్‌ ప్రతాప్‌, ఎంపిపి కొండా దుర్గాభవాని వెంకట్రావ్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన, కోర్లగుంట సోసైటీ అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, సర్పంచి నక్కనబోయిన సత్యనారాయణ, పేరం కృష్ణ, మాజీ సర్పంచి రేగుల గోపాలకృష్ణ, సోషల్‌ మీడయ కన్వీనర్‌ కంభాల దాసు, కంభాల రాంబాబు, ఎంపిడిఒ జి.రాణి, దాసరి సుధ పాల్గొన్నారు.

➡️