జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Jun 26,2024 22:51

పోలవరం మొదటి ప్రాధాన్యత
పారిశుధ్యం మెరుగుపరుస్తాం
సమస్యలను 9491041488కు కాల్‌ చేసి నాకు చెప్పొచ్చు
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి
ఘనస్వాగతం పలికిన అధికారులు
ప్రజాశక్తి – ఏలూరు
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌ చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్‌ వెట్రి సెల్వికి జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, ఐటి డిఎ ప్రాజెక్ట్‌ అధికారి ఎం.సూర్యతేజ, డిఆ ర్‌ఒ డి.పుష్పమణి, ఆర్‌డిఒలు ఎన్‌ఎస్‌కె.ఖాజావలీ, కె.అద్దయ్య, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి కె.కాశీవిశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపిస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ తన తొలి ప్రాధాన్యతని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజల తమ సమస్యలను నేరుగా తన ఫోన్‌ 9491041488 నెంబర్‌కు తెలియజేయవచ్చన్నారు. జిల్లాలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పనిచేసి రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏలూరు స్పోర్ట్స్‌: కలెక్టర్‌ వెట్రి సెల్విని జిల్లా ఎస్‌పి మేరీప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్‌పి కలెక్టర్‌కు మొక్క అందించారు. అనంతరం ఇరువురు కొద్దిసేపు జిల్లాలో శాంతిభద్రతలపై చర్చించారు.కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు ఏలూరు అర్బన్‌: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె.వెట్రి సెల్విని ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఎపి జెఎసి అమరావతి, ఎపిజెఎసి అమరావతి మహిళా విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌కుమార్‌ మా ట్లాడుతూ జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో రెవెన్యూ ఉద్యోగులుగా తమవంతు సహకారం పూర్తిగా అంది స్తామన్నారు. నాయ కులు ఎ.ప్రమోద్‌ కుమార్‌, కె.రవిచంద్ర, ఎస్‌. రాధాకృష్ణ, కె.మాధవి పాల్గొన్నారు. కొత్త కలెక్టర్‌ వెట్రి సెల్విని ఎపి ఎన్‌జిఒ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు మాట్లాడుతూ పరిపాలన విషయంలో ఉద్యోగులుగా తమ పూర్తి సహాయ సహకారాలు అందించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఉద్యోగులు ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏలూరు తాలూకా అధ్యక్షుడు శ్రీధర్‌ రాజు, కార్యదర్శి సత్యనారాయణ, ప్రత్యుషా, సునీత తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్త కలెక్టర్‌ వెట్రిసెల్విని జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఒకసారి రెడ్‌క్రాస్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించాలని కోరారు. జంగారెడ్డిగూడెం టౌన్‌: జిల్లా కలెక్టర్‌ వెట్రి సెల్విని జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కె.అద్దయ్య, జిల్లా దేవదాయ శాఖ అధికారి సిహెచ్‌.రంగారావు, మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మర్యాదపూర్వకంగా కలిసి, స్వామివారి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, పుష్పగుచ్ఛం, ప్రసాదాలు అందజేశారు.

➡️