‘ఆడుదాం ఆంధ్రా’లో యువకులు సత్తా చాటాలి

ప్రజాశక్తి – ముసునూరు

ఆడుదాం ఆంధ్రా ఆటలో ప్రతి ఒక్క యువకుడు పాల్గొని ఉత్సాహంతో తన సత్తా చాటాలని జెడ్‌పిటిసి డాక్టర్‌ ప్రతాప్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయనలు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రమణక్కపేట గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా ఆటలను సర్పంచి రంగు ధనలక్ష్మి గాంధీ, ఎంపిపి కొండా దుర్గా భవాని వెంకట్రావు పలువురు నాయకులతో కలిసి యువకులు ఆటల్లో ఎలా ప్రతిభ కనబరచాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివిఎస్‌.రామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు వాకా నాగరాజు పాల్గొన్నారు.

➡️