ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి

చాట్రాయి : ఆశావర్కర్స్‌కి కనీస వేతనాలు చెల్లించాలి, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశావర్కర్స్‌ మండల నాయకురాలు పుల్లమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈనెల 14, 15 తేదీల్లో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని వాల్‌ పోస్టర్‌ను మంగళవారం పిహెచ్‌సిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️