ఇల్లు కాలిపోయిన బాధితులకు సహాయం

జీలుగుమిల్లి : మండలంలోని దిబ్బగూడెం గ్రామంలో ముచ్చిక మంగరాజుకి చెందిన తటాకిల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. సర్వం కోల్పోయి బోరున విలపిస్తున్న బాధిత కుటుంబానికి సోమవారం పలువురు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి అవసరాల రీత్యా కొంత సహాయం అందించారు. రెవెన్యూ సిబ్బంది అధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందించినట్లు తెలిపారు. అంకన్నగూడెం పంచాయతీ సర్పంచి, వార్డు నంబర్‌లు కలిసి అవసరాల కొరకు నిత్యావసర వస్తువులను, రూ.10 వేల నగదును, కట్టుకునేందుకు బట్టలను జెడ్‌పిటిసి మల్లం వసంతరావు, సర్పంచి పైదా ముత్యాలమ్మ చేతుల మీదుగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ షమియెల్‌ బాషా, పైదా రామకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️