ఉపాధి కూలీలకు టెంట్‌ ఏర్పాటు : ఎపిఒ

ప్రజాశక్తి – ముసునూరు

ఉపాధిహామీ కూలీలకు టెంట్‌ సదుపాయం సమకూర్చినట్లు ఎపిఒ టి.రోజ్‌లీలా అన్నారు. శుక్రవారం మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీలకు పనిచేసిన అనంతరం కొంత సమయం ఎండలో లేకుండా వుండేందుకుగాను టెంట్‌ సమకూర్చినట్లు, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు ఎవరికైనా గాయమైనా ప్రథమ చికిత్స చేసుకునేందుగాను, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, మంచినీరు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి ఈ సంవత్సరంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహమీ చట్టం జరిగే మార్చి, ఏప్రియల్‌, మే, జూన్‌, జూలై, ఆగష్టు నెలలో జరిగే మండలంలోని 16 గ్రామాల్లో ప్రతిరోజుపైన ఏర్పాటు చేసిన సకల సదుపాయాలు కల్పించనున్నట్లు ఆమె తెలియజేశారు. ఎవరైనా మేట్‌ లేదా ఫిల్డ్‌ అసిస్టెంట్‌ ఈనెల నుంచి ఆగష్టు వరకు పని దినాలు ఏర్పాటు చేయకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.

➡️