ఎన్‌సిసి వాలంటీర్ల ప్రత్యేక శిబిరం

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

నూజివీడు పట్టణంలోని ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల ఎన్‌సిసి యూనిట్‌ ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ప్రతిపాటి విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ మెట్టగూడెం గ్రామంలో ప్రతిరోజు వాలంటీర్లు పారిశుధ్యం, బాల్యవివాహాలు, నీటి పొదుపు, బాలికల విద్య, స్వచ్ఛ గ్రామం, యువత ఆరోగ్యం, చిరుధాన్యాల ప్రాధాన్యం, ఓటు ప్రాధాన్యత, పరిసరాల పరిశుభ్రత, యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

➡️