ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తా

నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొలుసు పార్థసారథి

ముసునూరు: బిసి కమ్యూనిటీ, యాదవ సామాజికవర్గం నూజివీడు నియోజకవర్గం పరిధిలో అత్యధిక ఓట్లు ఉండటంతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నూజివీడు సీటు తమకు కేటాయించినట్లు టిడిపి నూజివీడు నియోజకవర్గం ఇన్‌ఛార్జి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం నూజివీడు నియోజకవర్గం బిసి(యాదవ) సామూహిక సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు నక్కనబోయిన మురళీకృష్ణ(లాయర్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో బిసి, యాదవ సామాజిక వర్గానికి ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి ఆ సమస్యను పరిష్కరించే వరకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా యాదవ సామాజిక నాయకులు పార్థసారథి వద్ద కొన్ని సమస్యలు ఉంచగా, వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కొలుసు రవికాంత్‌, గొలుసు నాగేశ్వరరావు, జోనుబోయిన రాంబాబు, చిర్రా పాల్గొన్నారు.

➡️