కృత్రిమ కాలు అందజేత

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

సమృద్ధి కలిగిన వారు లేనివారికి సహాయపడటమే మానవత్వమని హీల్‌ సంస్థ కార్యదర్శి తాతినేని లక్ష్మి అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అడుసుమిల్లి ప్రతాప్‌ తన భార్య అడుసుమిల్లి కృష్ణకుమారి జ్ఞాపకార్థం అందజేసిన విరాళంతో తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌లోని ఎలిజబెత్‌ పాంటన్‌ లెగసీ ఆఫ్‌ హోప్‌ కృత్రిమ అవయవ కేంద్రంలో నిడదవోలుకు చెందిన బాలిక బట్టు శృతికి అడుసుమిల్లి ప్రతాప్‌ కృత్రిమ కాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హీల్‌ ఫెసిలిటీస్‌ డైరెక్టర్‌ టి.భాస్కర్‌, సిఇఒ కె.అజరుకుమార్‌, సీనియర్‌ టెక్నీషియన్‌ కె.చిన్నా పాల్గొన్నారు.

➡️