క్షయ వ్యాధి నివారణపై అవగాహన

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవం సందర్భంగా ఆదివారం జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు వైద్యాధికారిణి బి.గాయత్రి తెలిపారు. క్షయ వ్యాధి నివారణకై పిహెచ్‌సి సిబ్బందితో ఆయా పాఠశాలలలో, స్వయం సహాయక సంఘాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి తగు మందులు వాడినట్లయితే వ్యాధిని నివారించుకోవచ్చని తెలిపారు. క్షయవ్యాధి మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని పరీక్షలు, మందులు అందుబాటులో వున్నాయని అన్నారు. ఎవరికైనా రెండు వారాలకు మించి పొడిదగ్గు వస్తున్నట్లయితే పిహెచ్‌సికి వచ్చి సంబంధింత పరీక్షలు చేపించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షయవ్యాధి పర్యవేక్షకులు రవిరాజు, వైద్య సిబ్బంది నాగేశ్వరావు, శ్రీనివాసరాజు, మంగతాయారు, ప్రసాద్‌, కేజియా, ఎఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

➡️