గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు : ఎంపిడిఒ

ముసునూరు : గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలని మహాత్మా గాంధీ కలలగన్న స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అని ఎంపిడిఒ జి.రాణి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముసునూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కొండా దుర్గా భవాని వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సుపరిపాలన, గ్రామ ప్రణాళిక అభివృద్ధి, గ్రామ సచివాలయ నిధులు, ప్రణాళిక విధానాలపై గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎంపిడిఒ ఆఫీస్‌ ఇఒ కూచిపూడి సాయిరాం, ఇఒపిఆర్‌డి బసవరాజు అచ్యుత సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️