జిఒ 513, 630 రద్దు చేయాలి : ఐలు

ప్రజాశక్తి – భీమడోలు

ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో పాటు జిఓ 513, 630 రద్దు చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలు) భీమడోలు శాఖ తీర్మానించింది. భీమడోలు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్ట్‌ పరిధిలోని న్యాయవాదులు ఐలు ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శుక్రవారం సమావేశమయ్యారు. కార్యక్రమానికి ఐలు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వి.శైలజ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, కార్యక్రమానికి పి.రాజారావు అధ్యక్షత వహించారు. అనంతరం శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. దీనిలో భాగంగా అధ్యక్షులుగా పి.రాజారావు, ఉపాధ్యక్షులుగా టి.వికాస్‌, ప్రధాన కార్యదర్శిగా పి.బాలాజీ, సంయుక్త కార్యదర్శిగా జి.సంజరు బాబు, కోశాధికారిగా పి.శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా జివి.ప్రసాద బాబు, కాలి నాగేశ్వరరావు, బివి.నారాయణ, ఒ.ప్రసాదరావు, ఈదా వెంకటరత్నం, ఆల్లాడ గంగాధర రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు న్యాయవాదులు అభినందించారు.

➡️