జిల్లాస్థాయి పోటీలకు ఎంపికవ్వడం ఆనందదాయకం

ప్రజాశక్తి – ముసునూరు

విద్యార్థుల్లో ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు కౌశిల్‌-2023 ఆటల పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయికి ఎంపిక కావడం ఆనందదాయకంగా ఉందని రమణక్కపేట జెడ్‌పి స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు పివిఎస్‌.రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని రమణక్కపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఈనెల 20వ తేదీన జిల్లా స్థాయిలో జరగనున్న ఆటల పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయుల కృషి, పట్టుదలతో ఎంపిక కావడం సంతోషకరంగా ఉందని ఆ విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయుడిని అభినందించారు.

➡️