డిఎన్‌ఆర్‌ను ఆశ్వీరదించాలి

కోడలు ఇంటింటా ప్రచారం

ప్రజాశక్తి – ముదినేపల్లి

ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావును మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోడలు దూలం స్వాతి ఆదివారం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని వైవాక గ్రామంలోని దళితవాడలో ఇంటింటా తిరిగి సార్వత్రిక ఎన్నికల ప్రచారం చేశారు. మరోమారు డిఎన్‌ఆర్‌ను ఆశీర్వదించాలని మహిళలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ ప్రచారంలో ఆమె వెంట ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య, వైస్‌ ఎంపిపి సునీత, మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️