తహశీల్దార్‌ విశ్వనాథరావు అకాల మృతి

ప్రజాశక్తి – చాట్రాయి

చాట్రాయి మండల తహశీల్దార్‌ సిహెచ్‌.విశ్వనాథరావుకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హుటాహుటిన విస్సన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 23 రోజులగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తహశీల్దార్‌ మృతి వార్త తెలియడంతో ఆయన ఫోటో పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఎపి కోఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైసిపి నాయకులు కారంగుల శ్రీనివాసరావు(వాసు), చెలికాని బాబ్జి, టిడిపి నాయకులు మోరంపూడి శ్రీనివాసరావు, మందపాటి బసవారెడ్డి, చాట్రాయి ఎంపిడిఒ కె.దుర్గాప్రసాద్‌, సూపర్నేంట్‌ ఎన్‌.మురళీమోహన్‌, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు.

➡️