నియోజవర్గ అభివృద్ధికి కృషి : విజయరాజు

ప్రజాశక్తి – చింతలపూడి

చింతలపూడి నియోజకవర్గాన్ని రాష్టంలో మొదట స్థానంలో నిలబెట్టి, అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని వైసిపి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం గ్రామంలో పరిచయ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. అనంతరం ఆరోగ్యమాత దేవాలయంలో ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, శ్రీను, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️