పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ఏలూరు టౌన్‌ : ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని బుధవారం నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 40 డివిజన్‌లో రూ.57.61 లక్షల వ్యయంతో తొమ్మిది రోడ్లు, ఆరు డ్రైనేజీలు, 41 డివిజన్‌లో రూ.54 లక్షల వ్యయంతో ఐదు రోడ్లు, ఆరు డ్రైనేజీలు, ఒక కమ్యూనిటీ హాల్‌ ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. 42 డివిజన్‌లో రూ.90 లక్షల వ్యయంతో ఐదు రోడ్లు, నాలుగు డ్రైన్లు, ఐదు కల్వర్టులు, 43 డివిజన్‌లో రూ.87.23 లక్షల వ్యయంతో 10 రోడ్లు, 8 డ్రైనేజీలు వెరసి మొత్తం రూ.2.91 కోట్ల వ్యయంతో 29 రోడ్లు, 24 డ్రైనేజీలు, 6 కల్వర్టులు, ఒక సామాజిక భవన ఆధునీకరణకు శంకుస్థాపనలు చేశారు.అంబేడ్కర్‌ సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణ నేపథ్యంలో ఆళ్ళ నానిని ఎస్‌సి, ఎస్‌టి పెద్దలు ఏలూరు క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృహత్కార్యానికి సంబంధించి సన్నాహక కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మహా విగ్రహావిష్కరణ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

➡️