పలు అభివృద్ధి పనులు ప్రారంభం

పోలవరం: మండలంలోని పాత పట్టిసీమ, కొత్త పట్టిసీమ, గూటాల గ్రామాల్లో సుమారు రూ.కోటి 30 లక్షలతో పక్కా డ్రైన్లు, సీసీ రోడ్లు, సొసైటీ గోడౌనులు, కొత్త పట్టిసీమలో నిర్మించిన కల్వర్టు, రైతు భరోసా కేంద్రం, పాత పట్టిసీమ వద్ద రూ.3 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన బస్సు షెల్టర్‌, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జెడ్‌పిటిసి ఛైర్మన్‌ గంటా పద్మశ్రీ ప్రసాద్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి కారుమూరి సునీల్‌ కుమార్‌, పోలవరం ఇన్‌ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి, జిల్లా ఎంపిపి సంఘాల అధ్యక్షులు, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాలో కుటుంబ సభ్యులుగా వాలంటీర్లు మమేకమై ఉన్నారని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశారని, జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు చేరవేశారని, ప్రజా ప్రతినిధుల కంటే ప్రజలలో వాలంటరీలే గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవకు సేవా మిత్రా, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను వాలంటీర్లకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫుడ్‌ కమిషనర్‌ మెంబర్‌ గంజి మాల దేవి, ఎంపిడిఒ జి.శ్రీను, సొసైటీ అధ్యక్షులు పాదం రాజాబాబు, అడ్డగర్ల సాయిబాబా పాల్గొన్నారు.

➡️