పాత పెన్షన్‌ విధానం టిడిపి మ్యానిఫెస్టోలో పెట్టాలి

గన్ని వీరాంజనేయులకు యుటిఎఫ్‌ నాయకుల వినతి

ఉంగుటూరు: పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తూ టిడిపి మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ నారాయణపురంలో ఉంగుటూరు మాజీ ఎంఎల్‌ఎ, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులుకు యుటిఎఫ్‌ నాయకులు శనివారం వినతిని అందజేశారు. సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాల వల్ల కలిగే నష్టాలను ఉపాధ్యాయులు గన్నికి వివరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డాకి జోగినాయుడు, జిల్లా కార్యదర్శి సిహెచ్‌.శ్రీధర్‌, గౌరవ అధ్యక్షులు శీతాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు హరికృష్ణ, జిల్లా కౌన్సిలర్స్‌ నరసింహారావు, టి.శ్రీధర్‌, బొమ్మిడి ప్రసాద్‌, గోవర్ధనరావు, తూతిక శివయ్య, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

➡️