పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

నూజివీడు పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆర్‌డిఒ భవాని శంకరి మంగళవారం సందర్శించారు. గతంలో కెడిసిసి బ్యాంకు ఆవరణలో ఉండే 180, 181 పోలింగ్‌ కేంద్రాలను పెద్ద చెరువు సమీపంలోని ఎంపి ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్న ఆవరణంలోకి మార్చారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ బూత్‌కు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తనను సంప్రదించాలని ఆమె అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

➡️