ప్రమాదకర మార్జిన్‌ పూడ్చివేత

కామవరపుకోట: మండలంలోని ఉప్పలపాడు, గొల్లగూడెం మధ్యలో ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లే రోడ్డుపై ప్రమాదకరస్థాయిలో ఉన్న రోడ్డు మార్జిన్‌ని ఎస్‌ఐ జయబాబు పూడ్పించి చదును చేయించారు. పొరపాటున వాహనదారులు చూడకుండా మార్జిన్‌లో దిగితే పెను ప్రమాదం జరుగుతుందన్నారు. రోడ్డు మార్జిన్‌ని జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు తడికలపూడి ఎస్‌ఐ జయబాబు అధ్వర్యంలో బుధవారం మట్టితో పూడ్చి, చదును చేయించడం జరిగింది. ఈ మార్జిన్‌ని పూడ్చడం పట్ల ఈ రహదారి వెంబడి ప్రయాణించే వాహన చోదకులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️