ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పెంపొందాలి

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

నూజివీడు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను డిఎస్‌పి అశోక్‌ కుమార్‌గౌడ్‌ శుక్రవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా స్టేషన్‌ రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. రిసెప్షన్‌ కౌంటర్‌, పలు రికార్డుల నిర్వహణపై అనేక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పెంపొందించాలి అని సూచించారు.

➡️