బాలుర వసతి గృహం సందర్శన

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

శనివారపు పేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్‌ సందర్శించారు. ఈ వసతి గృహంలో బాలలకు అందుతున్న వసతులపైన, ఆహార పదార్థాలు నాణ్యతపైన ఆరా తీశారు. శుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడొద్దని, పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన పోషక ఆహార పదార్థాలను అందించాలని, తద్వారా బాలురు ఆరోగ్యంగా ఉండి చదువును అభ్యసించడానికి, క్రమశిక్షణలో ఉండటానికి తోడ్పడుతుందని సూచించారు. అలాగే అబ్జర్వేషన్‌లోని బాలురకు ఉన్నటువంటి న్యాయ సదుపాయాలపైన, వారి తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, కావున విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం సూపరింటెండెంట్‌ పి.శ్రీవల్లి పాల్గొన్నారు.

➡️