బొర్రంపాలెంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

ప్రజాశక్తి – టి.నరసాపురం

మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో భగవాన్‌ శ్రీసత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో పరసా శ్రీను స్వాతి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన దుప్పట్లను ఎంపిటిసి కలపర్తి సుజాత రామకృష్ణలు సోమవారం 40 మంది వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి వుండాలన్నారు. సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చావ వీర రాఘవులు, రామారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️