మరలా జగన్మోహన్‌రెడ్డిని సిఎం చేయాలి

ముసునూరు: ప్రతి మహిళ అన్ని పథకాల లబ్ధి చేకూరాలంటే మరలా జగన్మోహన్‌రెడ్డిని సిఎం చేయాలని నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు డ్వాక్రా మహిళలనుద్ధేశించి పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రమైన ముసునూరు హైస్కూల్‌లో ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓడిపోయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి డాక్టర్‌ ప్రతాప్‌, ఎంపిపి కొండాదుర్గభవానీ వెంకట్రావ్‌, వైస్‌ ఎంపిపి కోటగిరి రాజానాయన, వైస్‌ ఎంపిపి పాముల గంగాధరరావు, సర్పంచులు పేరం కృష్ణ, రాజబోయిన శ్రీదేవి శ్రీనివాసరావు, రంగు ధనలక్ష్మి, కోర్లగుంట సోసైటీ అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, ఎంపిటిసిలు, తహాశీల్దార్‌ దాసరి సుధ, ఇఒపిఆర్‌డి బిఎ.సత్యనారాయణ, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

➡️