మహిళల ఉజ్వల భవిష్యత్తుకు ‘వైఎస్‌ఆర్‌ చేయూత’

Mar 11,2024 23:15

జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ
ప్రజాశక్తి – భీమడోలు
ఎంఎల్‌ఎ వాసుబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనతో సరిపెట్టకుండా వాటి నిర్మాణాలను పూర్తి చేసి ప్రముఖుల చేతులమీదుగా ప్రారంభోత్సవాలు చేయించడం అభినందనీయమని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ అన్నారు. గుండుగొలను కేంద్రంగా సోమవారం మండలస్థాయిలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెడ్‌పి చైర్‌పర్సన్‌ పద్మశ్రీ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అక్కా చెల్లెళ్ల ఉజ్వల భవితకు సహకరిస్తుందని తెలిపారు. గ్రామ ఉపసర్పంచి, వైసిపి గ్రామ అధ్యక్షులు ముదుండి సూర్యనారాయణరాజు విజ్ఞప్తి మేరకు గుండుగొలను హైస్కూల్‌ ఆటస్థలం అభివృద్ధికి రూ.30 లక్షల జెడ్‌పి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంఎల్‌ఎ వాసుబాబు మాట్లాడుతూ గ్రామ ఉపసర్పంచి విజ్ఞప్తి మేరకు గ్రామంలో నూతనంగా ఏర్పడిన జగనన్న కాలనీలో తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారానికి రూ.రెండు కోట్ల విలువైనరి జర్వాయర్‌ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి సూర్యనారాయణరాజు, ఎంపిపి కనమాల రామయ్య, గ్రామ సచివాలయాల గ్రామస్థాయి కన్వీనర్‌ గొటికల మురళి, మైనార్టీ కార్పొరేషన్‌ జిల్లా డైరెక్టర్‌ జహీర్‌, వైసిపి ప్రముఖులు రాయపాటి సత్యశ్రీనివాస్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చింతలపూడి :వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం సిఎం జగన్‌ ఇప్పటికి నాలుగు విడతలుగా లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమ చేశారని, ఇలాంటి వినూత్నమైన పథకం దేశంలో మరెక్కడా లేదని వైసిపి చింతలపూడి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయరాజు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నాలుగో విడత వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో 5358 మందికి సంబంధించిన రూ.10,04,62,500 చెక్కు నమూనను మహిళలకు అందించారు. ప్రతి పేదవాడికీ నాణ్యమైన విద్య అందించే విధంగా సిఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు నీరజ, వైసిపి నాయకులు పొన్నాల అనితమ్మ, వైసిపి పట్టణ కన్వీనర్‌ కొప్పుల నాగేశ్వరరావు, పట్టణ సచివాలయాల కన్వీనర్‌ నిమ్మగడ్డ దుర్గారావు, నాయకులు మిరియాల దిలీప్‌, గడ్డమడుగుల రాజేష్‌నాయుడు, గంధం చంటి పాల్గొన్నారు.ప్రొటోకాల్‌ కచ్ఛితంగా పాటించాలిఎంఎల్‌ఎ ఎలిజా చింతలపూడి : పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు రెండు వేర్వేరు అని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజా ప్రతినిధి మాత్రమే నిర్వహించాలని, ప్రొ టోకాల్‌ కచ్ఛితంగా పాటిం చాలని చిం తలపూడి ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా అన్నారు. సోమ వారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమానికి వెళ్లేందుకు బయలుదేరానని, కానీ అనధికారిక వ్యక్తులు, స్టేజి పైన ఉండడంతో వెళ్లడం ఇష్టం లేక మానేశానని తెలిపారు. గతంలో ప్రొటోకాల్‌పై అధికారులపై జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పార్టీ కార్యక్రమాలు ఇన్‌ఛార్జి చేసుకోవచ్చని, దానికి ఏ మాత్రం ఇబ్బంది లేదని, ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రం ప్రజా ప్రతినిధి మాత్రం నిర్వహించాలని తెలిపారు.

➡️