మోకాళ్లపై టిడిపి నాయకుల నిరసన

ప్రజాశక్తి – ఉంగుటూరు

జగన్‌ ప్రభుత్వం ఎస్‌సిలకు ఏమి ఉద్దరించారో శ్వేత పత్రం విడుదల చేయాలని టిడిపి ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షుడు నేకూరి ఆశీర్వాదం అన్నారు. శుక్రవారం కాగుపాడులో అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు పెద్ద మేనమామ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఎస్‌సిలపై అనేక విధాలుగా దాడులు, కేసులతో అవమానించి ఇప్పుడు విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏమెహం పెట్టుకుని ఆవిష్కరిస్తారని ప్రశ్నిస్తూ కాగుపాడులో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా యువరాజు, కాంతారావు పాల్గొన్నారు.

➡️