వృత్తి విద్యా నైపుణ్యంపై అవగాహన

జీలుగుమిల్లి : విద్యార్థుల్లో వృత్తి విద్యా నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ బి.పెద్దిరాజు తెలిపారు. మంగళవారం బర్రింకలపాడు గిరిజన గురుకుల పాఠశాల, కోటరామచంద్రపురం గురుకుల పాఠశాల విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యంలో భాగంగా ఒకేషనల్‌, ఇండిస్టియల్‌ క్షేత్ర పర్యటనలకు స్థానిక సిటిఆర్‌ఐకు తీసుకెళ్లి వివిధ రకాల వాణిజ్య పంటల విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ రమేష్‌, వెంకయ్య, వృత్తి విద్య బోధకులు, బాబు ప్రశాంత్‌, బృందం పాల్గొన్నారు.

➡️