వైద్య శిబిరాల ఏర్పాటు సంతోషకరం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

రెడ్‌క్రాస్‌ వంటి స్వచ్ఛంద సంస్థతో కలిసి అయోక ఫార్మాసిటికల్స్‌ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని, వ్యాపారంతో పాటు కొంత సమాజ సేవకు వినియోగించాలనే ఉద్దేశంతో ఉచితంగా మందులను పంపిణీ చేయడం గొప్ప విషయం అని జ్యుడీషియల్‌ మెంబర్‌, ఎన్‌సిఎల్టీ ముంబై బెంచ్‌ వేములపల్లి కిషోర్‌ అన్నారు. ముంబైకు చెందిన అయోక ఫార్మాసిటికల్స్‌, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కలపర్రు ఎంపిపి స్కూల్‌లో, హనుమాన్‌ జంక్షన్‌ ద్వారకా రియల్‌ ఎస్టేట్‌లో మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ వైద్య శిబిరాల నిర్వహణకు కమిటీ సభ్యులతో పాటు, అయోక ఫార్మా సిటికల్స్‌, ముంబై ఎమ్‌డీ ప్రహ్లాద్‌ సతి మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసుధ గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ సిఎండి రామా కోటేశ్వరరావు, అయోక ఫార్మా సిటికల్స్‌, ఎమ్‌డీ ప్రహ్లాద్‌ సతి పాల్గొన్నారు.

➡️