హీల్‌ స్కూల్‌లో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

స్పర్శతో అక్షరాలను గుర్తించే విధానం ద్వారా అంధులకు కూడా సకల విద్యలను అభ్యసించేందుకు దారి చూపిన మార్గదర్శకుడు డా.లూయిస్‌ బ్రెయిలీ అని ఫణీంద్ర చుండూరి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ విజ్‌వల్లీ ఛాలెంజ్‌డ్‌ చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సుఖవాసి రష్మంత్‌ అన్నారు. తోటపల్లి హీల్‌ స్కూల్‌లో ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం సందర్భంగా అంధుల బంధువు డా.లూయిస్‌ బ్రెయిలీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీల్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కోనేరు సత్యప్రసాద్‌, సిఇఒ కూరపాటి అజరు కుమార్‌, హీల్‌ అంధ పాఠశాల ఇన్‌ఛార్జి కె.అబ్రహంలు పాల్గొన్నారు.

➡️