హేలాపురిలో ప్రగతి బాటలు

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంఎల్‌ఎ ఆళ్ల నాని

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని ఏలూరు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం 26, 35, 44, 45 డివిజన్ల పరిధిలో రూ.1.29 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, మరో రూ.1.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఇడా ఛైర్మన్‌ బొద్దాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌లు ఎన్‌.సుధీర్‌ బాబు, గుడిదేసి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

➡️