పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ప్రజాశక్తి – భీమడోలు
భీమడోలు హైస్కూల్లో 35 ఏళ్ల క్రితం పదో తరగతి చదువుకున్న 1990వ సంవత్సరపు విద్యార్థులు ఆదివారం పాఠశాలలో బాల్య మిత్రుల ఆత్మీయ సంగమం పేర కలిశారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా జీవితంలో స్థిరపడిన వీరందరూ ఈ విధమైన సమావేశం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. రానున్న కాలంలో సైతం ఈ విధంగా కలవాలని ఆకాంక్షించారు.

➡️