వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలి

May 26,2024 22:23

సిపిఎం బృందం డిమాండ్‌
ప్రజాశక్తి – చాట్రాయి
మండలంలోని చిన్నంపేట గ్రామంలో వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న వారిని సిపిఎం బృందం ఆదివారం పరామర్శించింది. సిపిఎం బృందం మెడికల్‌ క్యాంపు వద్ద అధికారుల నుండి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యడు జి.రాజు మాట్లాడుతూ జ్వరాలు పూర్తిగా తగ్గేవరకూ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే జ్వర బాధితులంతా నిరుపేదల కుటుంబాలని, నిత్యావసర సరుకులను బాధిత కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. డాక్టర్‌ దుర్గాప్రసాద్‌తో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఆనందం మాట్లాడుతూ ఎందువల్ల జ్వరాలు వచ్చాయనే అంశంపై త్వరితగతిన నిర్థారించి, నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హోలీ మేరీ తదితరులు పాల్గొన్నారు.

➡️