CPM: పార్లమెంటుకు ట్రాక్టర్‌పై సిపిఎం ఎంపి అమ్రారామ్‌

Jun 24,2024 23:07 #CPM MP, #Parliament Session

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేత, సిపిఎం ఎంపి అమ్రారామ్‌ పార్లమెంటుకు ట్రాక్టర్‌పై వెళ్లారు. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. రాజస్థాన్‌లోని సికార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున గెలిచిన అమ్రారామ్‌ పార్లమెంటుకు ట్రాక్టర్‌పై వెళ్లారు. వ్యవసాయ పనుల్లో కీలక భాగస్వామి అయిన ట్రాక్టర్‌ రైతు పనిముట్టుగా తయారైంది. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటంలో రైతులతో పాటు ట్రాక్టర్లు వేలాదిగా పాల్గొన్నాయి. రైతులు తమతోపాటు ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆందోళనలు చేపట్టారు. అప్పుడు కొన్నాళ్లు ఢిల్లీలోని పార్లమెంట్‌, ఇండియా గేట్‌, కేంద్ర మంత్రిత్వశాఖ కార్యాలయాలును ప్రాంతాల్లో ట్రాక్టర్లను నిషేధించారు. అప్పటి నుంచి మోడీ సర్కార్‌లో ట్రాక్టర్‌ అంటే భయం పట్టుకుంది. అలాంటి ట్రాక్టర్‌పై సిపిఎం లోక్‌సభ ఎంపి అమ్రారామ్‌ పార్లమెంటుకు రావడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. అక్కడ ఉన్న అనేక మంది ట్రాక్టరుపై వచ్చిన ఎంపిని చూస్తూ అభినందనలు తెలిపారు. ట్రాక్టర్‌పై అమ్రారామ్‌ పార్లమెంటుకు చేరుకోగానే భద్రతా సిబ్బంది ట్రాక్టర్‌ను అడ్డుకునాురు. పార్లమెంటు లోపలకి వెళ్లడానికి లేదని పోలీసులు అడ్డుకుంటే, ఎంపి అమ్రారామ్‌ ఎందుకు ఆపుతున్నారని ప్రశిుంచారు. ఒకప్పుడు నిరసన తెలుపుతూ పార్లమెంటుకు ఎడ్లబండి మీద వెళ్లిన ఘటనలు ఉనాుయి. దేశంలోని రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ట్రాక్టరుపై పార్లమెంటుకు వచ్చారు. అయితే ఆయనను కూడా పార్లమెంటు గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు.

➡️