50 కుటుంబాలకు కూరగాయల పంపిణీ

ప్రజాశక్తి – టి.నరసాపురం

మండలంలోని కృష్ణాపురంలో భుక్యా గోపయ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు భూక్యా వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో మెట్టగూడెం గ్రామానికి చెందిన జోనుబోయిన శ్రీను కుమార్తె బిందు పుట్టినరోజు సందర్భంగా కృష్ణాపురం గ్రామంలో 50 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. మాజీ ఎంపిటిసి భూక్యా వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి జరబాల పూర్ణయ్య చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సేవా దృక్పథంతో తోటి వారికి సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్యా సత్యం, పాలబోయిన రామకృష్ణ, భూక్యా రాములు పాల్గొన్నారు.

➡️