మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభం

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు రోడ్డులో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో ఇప్పటివరకు లేనివిధంగా సకల సౌకర్యాలతో అన్ని హంగులతో తమ మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రి నుంచి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కలిగినందుకు గర్వపడుతున్నామన్నారు. తమ ఆసుపత్రిలో జంగారెడ్డిగూడెంలో ఇప్పటివరకు ఏ ఆసుపత్రిలో లేని అన్ని సేవలను వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. మమత హాస్పిటల్‌లో ప్రత్యేక విభాగాలైన గైనకాలజీ, ఆప్తమాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్‌, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఎక్కడాలేని డయాలసిస్‌ సేవలను తమ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

➡️