లో ఓల్టేజీ సమస్య పరిష్కారం

ప్రజాశక్తి వార్తకు స్పందన

జంగారెడ్డిగూడెం టౌన్‌ : మండలంలోని లక్కవరం గ్రామంలో లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని ఈనెల 7న శనివారం లక్కవరం పవర్‌ స్టేషన్‌ దగ్గర గ్రామస్తులు నిరసన చేపట్టిన విషయం విధితమే. లో ఓల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను 24 గంటలు గడవకముందే విద్యుత్‌ అధికారులు పరిష్కరించారు. ఈ సందర్భంగా లక్కవరం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. 25 కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో 63 కెపాసిటీ గల ట్రాన్స్‌ఫార్మర్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. 63 కెపాసిటీ గల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామానికి లో ఓల్టేజీ సమస్య పరిష్కారం అయ్యిందని గ్రామస్తులు విద్యుత్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

➡️