గుండెపోటుతో సీనియర్‌ జర్నలిస్ట్‌ కిషోర్‌ మృతి

ప్రజాశక్తి – చింతలపూడి
చింతలపూడి సీనియర్‌ జర్నలిస్ట్‌ కిషోర్‌ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కిషోర్‌ మరణ వార్త తెలుసుకున్న ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రెసిడెంట్‌ హరి, గౌరవ అధ్యక్షులు మూర్తి బాధిత కుటుంబానికి రూ.పది వేలు ఆర్థిక సాయం అందించారు. కిషోర్‌ మృతదేహానికి ప్రింట్‌ మీడియా ఆంధ్ర ప్రభ రిపోర్టర్‌ ఆజాద్‌ చెన్నారావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మిగతా కార్యక్రమాలు నిర్వహించేందుకు బాధిత కుటుంబానికి తోడ్పాటు అందించారు. కిషోర్‌ మృతదేహాన్ని ఎయిమ్‌ నాయకులు కాకర్ల సత్యం సందర్శించి నివాళులర్పించారు. వైసిపి నాయకులు వెంప కృష్ణ, పలువురు రిపోర్టర్లు నివాళులర్పించారు.

➡️